Pages

Subscribe:

Friday 21 March 2014

కన్నులతో పలకరించు వలపులు

  



ప: కన్నులతో పలకరించు వలపులు
ఎన్నటికి మరువరాని తలపులు
కన్నులతో పలకరించు వలపులు
ఎన్నటికి మరువరాని తలపులు
రెండు ఏకమై ప్రేమే లోకమై
నామది పాడే పరాధీనమై అలాగా!!

౧. చల్లని వేళ మల్లెల నీడ చక్కని దొంగ దాగెనట
చల్లని వేళ మల్లెల నీడ చక్కని దొంగ దాగెనట
దారులకాచే సమయము చూచి దాచిన ప్రేమ దోచెనట
మరలా వచ్చెను మనసే ఇచ్చెను
మరలా వచ్చెను మనసే ఇచ్చెను
అతనే నీవైతే ఆమే నేనట ,నిజంగా!!

౨. నల్లని మేఘం మెల్లగ రాగ నాట్యము నెమలి చేసినది
నల్లని మేఘం మెల్లగ రాగ నాట్యము నెమలి చేసినది
వలచినవాడు సరసకురాగ ఎంతో సిగ్గు వేసినది
తనివితీరా తనలో తానే
తనివితీరా తనలో తానే మనసే మురిసింది పరవశమొందగా ఓ ఐ సీ!!

0 comments:

Post a Comment