Pages

Subscribe:

Tuesday 18 March 2014

రామకథను వినరయ్యా

  
ప: రామకథను వినరయ్యా
ఇహపర సుఖముల నొసగే
సీతారామకథను వినరయ్యా

౧.  అయోధ్యా నగరానికి రాజు దశరథ మహారాజు
ఆ రాజుకు రాణులు మువ్వురు కౌసల్య సుమిత్రా కైకేయి
నోము ఫలములై వారికి కలిగిరి కొమరులు నలుగురు
రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ||| రామకథ |||

౨.  తాటకి దునిమి గన్నము గాచి  తపసుల దీవెన తలదాచి
జనకుని యాగము జూచు నెపమ్మున కనియెను మిథిలపురాజలది ||| రామకథ |||

౩.  సుకుమారుని కనుగొని మిథిలకు మిథిలయే కదిలినది
ధరణిజ మదిలో మెదలిన మోదము కన్నుల వెన్నెల విరిసినది ||| రామకథ |||

౪.  హరుని విల్లు రఘునాధుడు ఎత్తిన పెళపెళ విరిగినదీ
కళకళలాడే సీతారాముల కన్నులు కరములు కలిసినవి ||| రామకథ |||

0 comments:

Post a Comment