Pages

Subscribe:

Wednesday 26 March 2014

తెలుసుకో ఈ జీవితసత్యం జరిగేదే ఇది ప్రతినిత్యం


ప: ఈ జీవిత పాఠశాలలో అనుభవాలే ఉపాధ్యాయులు
అంతులేని సుఖదుఃఖాలలో అందరూ సహాధ్యాయులే
తెలుసుకో ఈ జీవిత సత్యం
జరిగేదే ఇది ప్రతినిత్యం
ఏ వయసునకా చోటుంది
అక్కడే నీకు పరువుంది
అప్పుడే నీకు సుఖముంది


౧. కడుపులో శిశువు కదిలి కుదిపితే అదియే తల్లికి ఆనందం
అక్కున చేర్చిన కొడుకు తన్నితే అదియే తండ్రికాహ్లాదం
ఎదిగిన సుతులే మమతలు మరచి ఎదురు తిరిగితే
నువ్వెక్కడ? నీపరువెక్కడ?
నీ చోటెక్కడ?!!

౨. తొలిరోజులలో ఆలుమగలది ఉరకలు తీసే ఉబలాటం
బాధ్యత ముగిసి మళ్ళిన వయసుల ముడివేసేదే అనురాగం
తొలిరోజులలో ఆలుమగలది ఉరకలు తీసే ఉబలాటం
బాధ్యత ముగిసి మళ్ళిన వయసుల ముడివేసేదే అనురాగం
 ఆ ఉబలాటం ఆ అనురాగం కరువైపోతే
నువ్వెక్కడ? నీ పరువెక్కడ?
నీ తోడెక్కడ? నీ నీడెక్కడ?



 

0 comments:

Post a Comment