Pages

Subscribe:

Tuesday 25 March 2014

చదువు రాని వాడవని దిగులు చెందకు

   
ప: చదువు రాని వాడవని దిగులు చెందకు
చదువు రాని వాడవని దిగులు చెందకు
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు
మంచు వంటి మల్లె వంటి మంచి మనసుతో
మంచు వంటి మల్లె వంటి మంచి మనసుతో
జీవించలేని పనికి రాని బ్రతుకులెందుకు

౧.  యేమి చదివి పక్షులు పైకెగుర గలిగేను
యే చదువు వల్ల చేప పిల్లలీద గలిగెను
యేమి చదివి పక్షులు పైకెగుర గలిగేను
యే చదువు వల్ల చేప పిల్లలీద గలిగెను
అడవిలోని నెమలికెవడు ఆట నేర్పెను
అడవిలోని నెమలికెవడు ఆట నేర్పెను
కొమ్మ పైని కోయిలమ్మ కెవడు పాట నేర్పెను!!

౨.  తెలివి లేని లేగ దూడ పిలుచుని అంబా అని
యేమెరుగని చంటి పాప యేడ్చును అమ్మా అని
తెలివి లేని లేగ దూడ పిలుచుని అంబా అని
యేమెరుగని చంటి పాప యేడ్చును అమ్మా అని
చదువులతో పని యేమి హృదయమున్న చాలు
చదువులతో పని యేమి హృదయమున్న చాలు
కాయితంబు పూవు కన్న గరిక పూవు మేలు!!

0 comments:

Post a Comment