Pages

Subscribe:

Saturday 22 March 2014

ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో కలిపింి

              
ప: ఏ తీగపూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది
ఏ వింత అనుబంధమౌనో
అప్పిడన్న... అర్థం కాలేదా
ఏ తీగపూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది
ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో

౧.  మనసు మూగది మాటలు రానిది
మమత ఒకటే అది నేర్చినది
ఆహా అప్పడియ... పెద్ద అర్థం అయినట్టు
భాషలేనిది బంధమున్నది
మన ఇద్దరిని జత కూర్చినది
మన ఇద్దరిని జత కూర్చినది!!

౨.  వయసే వయసును పలకరించినది
వలదన్నా అది నిలువకున్నది
ఏ నీ రొంబ అలహారిక్కే ఆ రొంబ అంటే
ఎల్లలు ఏవి ఒల్లనన్నది
నీది నాదొక లోకం అన్నది
నీది నాదొక లోకం అన్నది!!

౩.  తొలి చూపే నను నిలవేసినది
మరుమాపై అది కలవరించినది
నల్ల పొన్ను అంటే నల్ల పిల్ల
మొదటి కలయికే ముడివేసినది
తుది దాక ఇది నిలకడైనది
తుది దాక ఇది నిలకడైనది
ఏ తీగపూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది
ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో!!

0 comments:

Post a Comment