Pages

Subscribe:

Thursday 6 March 2014

విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో

    
చిత్రం:బందిపోటు దొంగలు
సంగీతం: పెండ్యాల
రచన: దాశరథి
గానం: ఘంటసాల

ప: విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో
తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో
విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో
తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో
విరిసిన వెన్నెలవో

౧. సిగలో గల జాబిల్లి చిరునగవులు చిందగా
సిగలో గల జాబిల్లి చిరునగవులు చిందగా
అడుగడుగున హంసలు ఒయ్యారము లొలుకగా
వెతికే పెదవులతో ..తొణికే మధువులతో
వెతికే పెదవులతో ..తొణికే మధువులతో
పొందుగోరి చెంతజేరి మురిపించే నా చెలీ!!విరిసిన!!

౨. కరుణలేని శిలనైనా కరిగించే నవ్వుతో
కరుణలేని శిలనైనా కరిగించే నవ్వుతో
ముల్లునైన మల్లియగా మలచే కనుదోయితో
నడిచే తీగియవై పలికే దీపికవై
నడిచే తీగియవై పలికే దీపికవై
అవతరించి ఆవరించి అలరించే నా చెలీ!!విరిసిన!!

0 comments:

Post a Comment