Pages

Subscribe:

Tuesday 25 March 2014

అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి

       
ప: అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి (2)
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న (2)
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి..
ఆ రాజుకు ఏడుగురు కొడుకులున్నారు
వారు చదువుసంధ్యలుండికూడ చవటలయ్యారు, వొట్టి చవటలయ్యారు!!

౧. పడకమీద తుమ్మముళ్ళు పరచెనొక్కడు
అయ్యో ఇంటిదీపమార్పివేయ నెంచెనొక్కడు
తల్లీతండ్రులు విషమని తలచెనొక్కడు (2)
పడుచుపెళ్ళామే బెల్లమని భ్రమశెనొక్కడూ, భ్రమశెనొక్కడు!!

౨. కొడుకులతో బాటు రాజు కుక్కను పెంచి ప్రేమయనే పాలు పోసి పెంపు చేసెను (2)
కంటిపాప కంటె ఎంతొ గారవించెను (2)
దాని గుండెలోన గూడు కట్టి ఉండసాగెను తానుండసాగెను!!

౩. నాది నాది అనుకున్నది నీది కాదురా నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా (2)
కూరిమి గలవారంతా కొడుకులేనురా (2)
జాలిగుండె లేని కొడుకుకన్న కుక్క మేలురా, కుక్క మేలురా!!


0 comments:

Post a Comment