Pages

Subscribe:

Tuesday 18 March 2014

జగదభిరాముడు శ్రీరాముడే

     
 జయ జయరామ్ జయ రఘురామ్
ప: జగదభిరాముడు శ్రీరాముడే
రఘుకుల సోముడు ఆ రాముడే
జనకుని మాటల తలపై నిలిపీ
తన సుఖముల విడి వనితామణితో
వనముల కేగిన ధర్మావతారుడు ||జగదభి||

౧. కరమున ధనువు శరములు దాలిచి (3)
ఇరువది చేతులు దొరనే కూలిచి
సురలను గాచిన వీరాధి వీరుడు ||జగదభి||

౨.  ఆలూ మగలా అనురాగాలకు (2)
పోలిక సీతారాములె యనగా (2)
వెలసిన ఆదర్శ ప్రేమావతారుడు ||జగదభి||

౩.  నిరతము ధర్మము నెరపీ నిలిపీ (2)
నరులకు సురులకు తరతరాలకూ
ఒరవడియైన వర యుగపురుషుడు ||జగదభి||

౪.  ఇనకుల మణి సరితూగే తనయుడు
అన్నయు ప్రభువు లేనేలేడని ||ఇన||
జనులు భజించే పురుషోత్తముడు ||జగదభి||
జయ జయరామ్ జయ రఘురామ్

0 comments:

Post a Comment