Pages

Subscribe:

Saturday 22 March 2014

అందాల రాణివె

                     
అందాల రాణివే నీవెంత జాణవే
కవ్వించి సిగ్గుచెంద నీకున్యాయమా
వీరాధివీరులే రణరంగ ధీరులే
ఇదేమి వింతయేల ఇంత తొందరా
వీరాధివీరులే

౧.పరీక్ష చాలులే ఉపేక్ష యేలనే
సుఖాల తీరము ఇకెంత దూరము
పరీక్ష చాలులే ఉపేక్ష యేలనే
సుఖాల తీరము ఇకెంత దూరము
ఉపేక్ష కాదిది అపేక్ష ఉన్నది
నిరీక్ష చాల మంచి్దీ!!వీరాధి!!

౨.  క్రీగంటితో నను దోచి నాగుండె దొంగిలి దాచి
చాటుగా మాటుగా ఆడుతే చాలులే ఆడుతే చాలులే
చాలులే చాలులే
శ్రీవారి హృదయము నా చెంత పదిలము
నా ప్రేమ నిరతము కాపాడు కవచము
శ్రీవారి హృదయము నా చెంత పదిలము
నా ప్రేమ నిరతము కాపాడు కవచము
ప్రియురాలి రూపము రేగించె మోహము
నేనింక తాళజాలనే!!అందాల!!

౩. నీవంటి వారికి మేలా మేలెంచు పెద్దలు లేరా
వారిదే భారము యేల ఈ ఆగము
ఆగు ఆగుము
ఆగను ఆగను
ఏకాంత సమయము ఆనంద నిలయము
నీవెన్ని అనిను నీచేయి విడువను
ఏకాంత సమయము ఆనంద నిలయము
నీవెన్ని అనిను నీచేయి విడువను
జగానికందము వివాహబంధము ఆనాడె తీరు వేడుకా!!అందాల!!



0 comments:

Post a Comment