Pages

Subscribe:

Thursday 6 March 2014

కలకల విరిసీ జగాలే పులకించెలే

                       
చిత్రం: శభాష్ రాముడు
సంగీతం: ఘంటసాల
రచన: శ్రీశ్రీ
గానం: ఘంటసాల, పి సుశీల

ప: కలకల విరిసీ జగాలే పులకించెలే 2 సార్లు
వలపులు కురిసి సుఖాలే చిలికించెనే 2 సార్లు

౧. అలరుల తోటా అందాల బాట
హాయిగ పాడే కోయిల పాట కోయిల పాట
తెలియని కోరికలేవో కలిగించెనే!!కలకల!!

౨.  చల్లనిగాలీ మెల్లగ వీచే
హృదయము దూసి మనసే దోచే మనసే దోచే
మనసులు నిండి ప్రణయాలే చెలరేగెనే!!కలకల!!

౩. చెలిచూపులలో అనురాగాలు
నిజమేనా అని అనుమానాలు అనుమానాలు
సందేహాలేలా హృదయాలే మన సాక్షులు!!కలకల!!





0 comments:

Post a Comment