Pages

Subscribe:

Saturday 22 March 2014

ఎవరివో నీవెవరివో

                      
ఓ సజీవ శిల్ప సుందరి
నా జీవన రాగమంజరి
ఎవరివో ఎవరివో ఎవరివో నీవెవరివో
ఎవరివో ఎవరివో
నా భావనలో నా సాధనలో
నాభావనలో నా సాధనలో నాట్యము చేసే రాణివో
ఎవరివో నీవెవరివో

౧. దివినే వదలి భువికేతెంచి తేనెల వెన్నెల సోనవో
కవితావేశమే కలలై అలలై కురిసిన పువ్వుల వానవో !!

౨. నవ వసంతమున నందనవనమున
నవ వసంతమున నందన వనమున కోయిల పాడిన పాటవో
నవ వసంతమున నందన వనమున కోయిల పాడిన పాటవో 
వలపు కొలనులో కలకల విరిసిన కలువల కన్నుల కాంతివో!!

౩. నీకరకంకణ నిక్వణమఅది వాణీ వీణా నినాదమా
నీపదనూపుర నిశ్వనమాఅది జలధి తరంగ మృదంగ రావమా
రావే మోహన రూపమా రావే నూతన తేజమా
రావే రావే!!

0 comments:

Post a Comment