Pages

Subscribe:

Sunday 23 March 2014

కాశీపట్నం చూడర బాబు కల్లాకపటం లేని గరీబు


ప: ఓహో నిలబడితే పడిపోయే నీరసపు నీడవంటి బీదవాడా
ఆ ... మనిషిగా బ్రతికేందుకు కనీస అవసరాలైనా లేనివాడా
అయ్యయ్యో ..
కాశీపట్నం చూడర బాబు కల్లా కపటం లేని గరీబు
అల్లో లక్షణ అని అల్లాడే పల్లెల దుస్థితికేమి జవాబు

౧. నిరాశతోను నిస్పృహలోను తెరువెరుగని నిరుపేదలు
మురికి గుంటలు ఇరుకు కొంపలు నిండిన చీకటి పేటలు
పాడు రోగాలు మోసుకు తిరిగి ప్రజలను చంపే ఈగలు
కరువు బరువు పరితాపాలు కలిసి వెరసి మన పల్లెలు!!

౨. శరీరాల్లో అరచాటాకైనా రక్తం లేని దరిద్రులనే
పీల్చుకు తింటాడు దోమరాక్షసుడు
వాడి దుంప తెగ
మేడ మిద్దెల్లో నివసించే వారి జోలికైనా పోదు గదా
అయ్యయ్యూ ...
వైద్య సహాయం అసలే లేదు ఉన్నా దొరకవు మందులు
డాక్టర్ కోసం వెతికే లోగా రోగులు గుటుక్కుమందురు
నెత్తురు పీల్చే వృత్తి పరులే మన గ్రామాలకు కామందులు
దొరలూ దోమలు పల్లె జనాలను పంచుకు నంచుకు తిందురు!!

౩. ప్రజలతో సమానంగా కష్టసుఖాలను పంచుకుంటామంటారు మన వినాయకులు
అవునవును సుఖాలన్నీ తమకు దక్కించుకుని కష్టాలన్నీ మనకు వదిలేస్తారు
ఎవరో వచ్చి సాయం చేస్తారనుకోవడమే పొరపాటు
పదవులు వస్తే ప్రజను మరవడం బడా నాయకుల అలవాటు
మనలో శక్తి మనకే తెలియదు అదే కదా మన గ్రహపాటు
తెలిసి కలిసి నిలిచిన నాడు ఎదుటివాడికది తలపోటు

0 comments:

Post a Comment